నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దానితో ఒక సినిమా పూర్తి కాక ముందే మరో సినిమాను లైన్ లో పెడుతూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితమే బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

మూవీ సెట్స్ పై ఉండగానే బాలయ్య , బాబీ దర్శకత్వంలో మూవీ కి కమిట్ అయ్యాడు. దానితో భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే బాలయ్య , బాబి సినిమాను స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్ప్పెడ్ గా జరుగుతుంది. ఇకపోతే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య , బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ అనంతరం కొంత కాలం పాటు షూటింగ్ లకి గ్యాప్ ఇవ్వాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం మరి కొన్ని రోజుల్లోనే ఏపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఆలోపు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ ను పూర్తి చేసి ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కేవలం రాజకీయాలపై దృష్టి పెట్టాలి అని బాలయ్య డిసైడ్ అయినట్లు ..  అందులో భాగంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మళ్లీ సినిమా షూటింగ్ లలో పాల్గొనాలి అని బాలయ్య ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బాబి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ తర్వాత బాలకృష్ణ , బోయపాటి శ్రీను దర్శకత్వం లో "అఖండ 2" సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: