బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఇకపోతే ఈయనకి కొంత కాలం పాటు వరస అపజయాలు ఎదురు కావడంతో చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అలా కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న షారుక్ పోయిన సంవత్సరం ప్రారంభంలో పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇకపోతే యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ వారు ఈ సినిమాను స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా నిర్మించారు.

ఈ సినిమాకు బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి షారుఖ్ కి అదిరిపోయే రేంజ్ కం బ్యాక్ ను తీసుకువచ్చింది. ఇకపోతే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ సక్సెస్ కావడంతో ఆ వెంటనే ఈ మూవీ కి కొనసాగింపుగా పటాన్ 2 ఉండబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.

ఇకపోతే పటాన్ సినిమాకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ "పటాన్ 2" కు కూడా దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... పటాన్ మూవీ కి దర్శకత్వం వహించినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ "పటాన్ 2" మూవీ కి దర్శకత్వం వహించే అవకాశాలు లేవు అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే ఈ చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: