టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఇటీవలే వివాహానికి సిద్ధమయ్యింది. బాలీవుడ్ నటుడు నిర్మాత అయినటువంటి జాకీ భగ్నానీతో ఈ రోజున ఈకో ఫ్రెండ్లీ పద్ధతిలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. గత కొద్ది రోజులుగా వీరి పెళ్లి గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరొకవైపు పెళ్లికి హాజరయ్యేటువంటి అతిధులు కూడా ఇప్పటికే గోవాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రకుల్ ఆమె భర్తకు సంబంధించిన ఆస్తి వివరాలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి.


ఢిల్లీ ప్రాంతానికి చెందిన రకుల్ ప్రీతిసింగ్.. గ్రాడ్యుయేట్  పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపుగా అడుగులు వేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు హిందీ సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తన కెరియర్ మారిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ  మళ్లీ బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చి ఎక్కువగా బాలీవుడ్ లోనే పలు సినిమాలలో నటిస్తోంది.

కరోనా లాక్డౌన్ సమయంలో బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్నట్టుగా తెలియజేశారు. 2021 అక్టోబర్ ను అధికారికంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరూ చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నారు. దాదాపుగా మూడేళ్ల తర్వాత వీరు వివాహ బంధంతో ఈరోజు గోవాలో ఒకటి కాబోతున్నారు. వీరి ఆస్తుల విషయానికి వస్తే.. రకుల్ ప్రీతిసింగ్ దగ్గర నాలుగు కార్లతో పాటు.. రెండు ఇల్లులు తమ సొంత ఊరిలో 25 ఎకరాల పొలం ఉన్నట్టుగా తెలుస్తోంది.మొత్తంమీద ఈమె ఆస్తి 50 కోట్లు ఉన్నట్లు సమాచారం.జాకీ భగ్నానీ విషయానికి వస్తే 5 లక్సరీ కార్లతో పాటు.. మూడు అపార్ట్మెంట్లు ఇతరత్రా భూములతో దాదాపుగా 54 కోట్లకు పై మాటే ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో ఇద్దరు దగ్గర ఆస్తి కలిపితే దాదాపుగా 100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: