తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు.. అలాగే కమర్షియల్స్ ప్రమోషన్స్ అండ్ యాడ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తుంటారు. అయితే ఆ సంపాదనని తన కోసం కాకుండా పేదలు కోసం, చిన్న పిల్లల చికిత్సల కోసం ఉపయోగి స్తుంటారు..ఎన్నో బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి.. ఇప్పుడు మరొకటి వచ్చేసింది.. ప్రస్తుతం 25 బ్రాండ్స్ ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు..ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే స్మార్ట్ స్పీకర్ల కు మహేష్ తన గొంతుని ఇస్తున్నారు. ఫోన్ పే నుంచి మనీ సెండ్ చేసినప్పుడు.. మనీ రీసివ్డ్ అంటూ ఓ వాయిస్ వస్తుంది.. ఆ వాయిస్ గతం లో కంప్యూటర్ ద్వారా అందించేవారు.. కానీ ఇప్పుడు ఆ వాయిస్ ను మహేష్ బాబు ఇస్తున్నారు..మహేష్ వాయిస్ తో కొన్ని శాంపిల్స్ తీసుకోని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారు.. ఇక మీదట ఆ స్మార్ట్ స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్ వినిపిస్తుంది.. గతంలో అమితాబ్ వాయిస్ కూడా వినిపించింది.. ఇప్పుడు మహేష్ వాయిస్ విని పిస్తుంది..ఇక నుంచి ఫోన్ పే పేమెంట్ సౌండ్ బాక్స్‌లో మహేశ్ బాబు వాయిస్..పేమెంట్ రిసీవ్ అవ్వ గానే మహేశ్ బాబు వాయిస్‌లో వాయిస్ అలెర్ట్ రానుంది.మహేష్ అందానికే కాదు గొంటుకూడ ఇండియా ఫ్యాన్ అవ్వబోతుంది..
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. మహేష్ రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా పొంగల్ హిట్ గా నిలిచింది. ఇక నెక్ట్స్ టాలీవుడ్ జక్కన్న.. పాన్ వరల్డ్ డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయ బోతున్నాడు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. SSMB29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈసినిమా మే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది… వచ్చే ఏడాది విడుదల కానుందని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: