చాలామంది నటీనటులు డబ్బులు సంపాదిస్తారు కానీ వాటిని ఇన్వెస్ట్ చేసుకోవడానికి లేదా సేవ్ చేసుకోవడానికో వారికి అవకాశం ఉండదు. పైగా ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనే క్లారిటీ కూడా వారికి సరిగా ఉండదు.అందుకే ఎవరికి పడితే వారిని నమ్మి డబ్బులు పోగొట్టుకుంటారు చాలామంది. సోషల్ మీడియాలో ఫలానా హీరోయిన్ తన మేనేజర్ చేతిలో మోసపోయింది అనే వార్తను మనం చూస్తూ ఉంటాం. అందులో 90% నిజాలే ఉంటాయి. ఎందుకంటే డబ్బును ఎలా సేవ్ చేయాలి లేదా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయం తెలియకపోవడంతో తమ చుట్టూ ఉన్న మేనేజర్స్ మాటలు మాత్రమే నమ్ముతారు వాళ్ళు.అలా నమ్మి కోట్ల రూపాయలు మోసపోయిన సందర్భాలు ఉన్నాయి.ఎక్కువగా ఇలాంటి వాటిల్లో హీరోయిన్స్ మోసపోతూ ఉంటారు. ఇక హీరోల విషయానికి వచ్చేసరికి వారు కొంత సేఫ్ జోన్ లోనే ఎప్పుడు గేమ్ ఆడుతుంటారు. అయినా కూడా అందరూ డబ్బు కూడాబెట్టాలని రూలేమీ లేదు. మన టాలీవుడ్ విషయానికి వచ్చేసరికి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే డబ్బు ఒక రూపాయి ఇస్తే 10 రూపాయలు చేసుకోవడం అనే టాలెంట్ ఉన్న ఏకైక హీరో దగ్గుబాటి రానా.తండ్రి సురేష్ బాబుపోలికలు వచ్చాయో లేదా తాత రామానాయుడు పోలికలు వచ్చాయో తెలియదు కానీ చిన్న వయసు నుంచే డబ్బులను సరిగ్గా కాపాడుకోవడం అనేది రానాకు తెలుసు. చిన్నతనంలోనే రానాతన ట్యూషన్ మాస్టర్ దగ్గర డబ్బులు తీసుకొని ఇంట్రెస్ట్ కి బయట తిప్పుతూ మళ్లీ దానినే రివర్స్ లో ఆయనకు ఫీజుగా ఇచ్చేవాడట. ఈ విషయాన్ని ఓసారి సుమ షోలో రానా నే చెప్పాడు.  ఇక చాలామంది కి తనతో ఉండేవారికి రానా మాస్టర్ మైండ్ అనే విషయం తెలుసు. అతడికి పెట్టుబడుల విషయంలో ఒక క్లారిటీ ఉంటుందని డబ్బు సినిమాల్లో పెట్టాలా లేదా బయట ఎక్కడన్నా పెట్టాలన్నా కూడా చాలా మంది రానా సలహాలు తీసుకుంటూ ఉంటారట.ఇది ఏమైనా వ్యాపార దిగ్గజ మనవడు కాబట్టి ఆ మాత్రం పోలికలు రావడం సహజమే. అందుకే రానా ఇప్పటి నుంచే సినిమాలు మరోపక్క హోస్టింగ్ అని మన వైపు షోలు చేస్తూ రెండు చేతుల డబ్బు సంపాదిస్తున్నాడు. తెలుగులో హీరోగా చేస్తూ బాలీవుడ్ లో విలన్ గ అనేక సినిమాలు చేస్తున్నాడు. ఇలా రకరకాల స్ట్రాటజీస్ చేస్తూ డబ్బులు బాగానే కూడబెడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: