బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ వాసంతిగురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఒకటి రెండు సినిమాల కు హీరోయిన్ గా నటించి నప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు కానీ బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ని సంపాదించుకుంది.ఇక గత ఏడాది డిసెంబర్ లో తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరు పుకుంది ఈ భామ. పవన్ కళ్యాణ్ కూడా సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటాడు.ఇక మంగ ళవారం నాడు ప్రియుడు పవన్ కళ్యాణ్ తో సొంత ఊరు తిరుపతిలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచింది వాసంతి.  ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తిరుపతికి చెందిన వాసంతి సిరిసిరిమువ్వలు సీరియల్తో ఇండస్ట్రీలోకి వచ్చింది. గోరింటాకు, గుప్పెడంత మనసు సీరియల్ లోను ఈమె యాక్ట్ చేసింది.భువన విజయం లాంటి పలు చిత్రాలలో సహాయ పాత్రలు పోషిం చింది.అలాగే కన్నడంలో కూడా చాలా సినిమాలు చేసింది వాసంతి. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ తో వాసంతి గత ఏడాది ప్రేమలో పడ్డారు. వీరు నిశ్చితార్థం కూడా గత ఏడాది డిసెంబర్లో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే వాలెంటెన్స్ డే సందర్భంగా వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఇప్పుడు వివాహ బంధంతో ఒకటైన ఈ జంటని కలకాలం అన్యోన్యంగా ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు వీరి పెళ్లి వీడియోఇంస్టాగ్రామ్ లో చెక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక వాసంతి అర్జున్ కళ్యాణ్తో కలిసి బీబీ జోడి షోలో అదిరిపోయే పెర్ఫామ్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: