తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్.. ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి.ఇక ఇదిలా ఉంటే 2001 వ సంవత్సరం లో ఖుషి సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత 2012 వరకు పవన్ కళ్యాణ్ కి సరైన సక్సెస్ లేదు. అయిన కూడా ఈ పది సంవత్సరాల్లో ఆయన క్రేజ్ మరింత పెరిగిందే తప్ప, తగ్గలేదనే చెప్పాలి. అలాంటి స్టార్ డమ్ ను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా కొనసాగుతున్నాడు. ఇక ఈ సమ్మర్ లో ఎలక్షన్లు ఉండడం వల్ల ఆయన పొలిటికల్ గా చాలా బిజీగా ఉంటున్నాడు. ఈ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత ఆయన కమిట్ అయిన సినిమాలని పూర్తి చేసే పనిలో పడతాడు. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని తెలుసుకోవడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.
అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హీరోయిన్లు పెద్దగా ఎవరు నచ్చరట, కానీ అలనాటి మేటి నటి అయిన ‘సావిత్రి ‘ గారంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమని, అలాగే ఆవిడ నటన అన్న కూడా తనకి చాలా ఇష్టమని కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఓజి, క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు, అట్లీ తో తేరి రీమేక్ లను చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమాలన్నీ ముగిస్తే తప్ప మరో కొత్త సినిమా కమిట్ అయ్యే ఆలోచనలో పవన్ కళ్యాణ్ లేడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఈ నాలుగు సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఏపి లో ఎలక్షన్స్ సీజన్ వల్ల ఆరు నెలలు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ఎలక్షన్స్ తర్వాత మరో నెలరోజుల పాటు రెస్ట్ తీసుకొని సినిమా షూటింగ్ ల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది…

మరింత సమాచారం తెలుసుకోండి: