టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మరియు అతని ఫ్యామిలీ అంటే ఒక గుర్తింపు ఉందన్న సంగతి తెల్సిందే. అయితే ఆయన బాట లోనే తనయుడు రాంచరణ్ కూడా అడుగులు వేసి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగినది మనం ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా చూసాం. అయితే వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం వెనక ఉండి ఎప్పటికప్పుడు ప్రోత్సహించే సురేఖ గారు అని మెగాస్టార్ చాలా సందర్భాల్లో చెప్పారు.ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు ఎంత బాగుంటాయో ఎలాంటి కలెక్షన్స్ రాబడతాయో కూడా మనకు తెలిసిందే.కాగా తాను జీవితంలో ఇంత పెద్ద స్థానాన్ని సంపాదించుకోవడానికి కారణం తన భార్య సురేఖ అంటూ పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టాడు మెగాస్టార్ చిరంజీవి .తను ఇంట్లో పిల్లలను చూసుకుంటూ కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం వల్లే నేను సినిమాలో ఏ చీకుచింత లేకుండా నటించగలిగాను అని .. మీ ముందు మెగాస్టార్ గా నిలుచున్నాను అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకు వచ్చారు. ఇప్పటికీ తన సక్సెస్ కి టాప్ సీక్రెట్ తన భార్య అంటూ చెప్పుకొస్తూ ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి . రీసెంట్గా చిరంజీవి పెళ్లి చేసుకొని 43 ఏళ్లు అవుతుంది .ఈ క్రమంలోని ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది . మెగాస్టార్ చిరంజీవి తన 43 ఏళ్ల సంసార జీవితంలో ఒక్కసారి కూడా సురేఖతో దురుసుగా ప్రవర్తించింది లేదట. చిన్న మాటలకే కోప్పడిపోయి ..పోట్లాడుకునే భార్యాభర్తలు ఉన్నారు. అలాంటిది 43ఏళ్ల సంసార జీవితంలో చిరంజీవి ఒక్కసారి కూడా సురేఖ పై చేయి ఎత్తలేదు అంటే దానికి కారణం సురేఖ ఓర్పు సహనం అనే చెప్పాలి . ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవడం.. భర్తకు నచ్చినట్లు మెలగడంలో సురేఖ తర్వాతే ఎవరైనా అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: