రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగలక్ష్మి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898AD. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడు నాగ అశ్విన్. VFX వర్క్ పెండింగ్లో ఉన్న కారణంగా ఈ సినిమాను అనుకున్న రిలీజ్ డేట్ కు వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. మే 9న ప్రభాస్ కల్కి రిలీజ్ అనౌన్స్ చేశారు మేకర్స్ కానీ ఇప్పుడు ఆ డేట్ మార్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

కల్కి 2898 AD కొత్త రిలీజ్ డేట్ ఇప్పుడు అన్నది తెలియదు. ఈ సినిమా రిలీజ్ అనుకున్న మే నెలలో సినిమా ఎలాగూ రిలీజ్ అవ్వదు కాబట్టి టీజర్ అయిన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కల్కి అనౌన్స్మెంట్ తర్వాత ఒక ఫస్ట్ లుక్ గ్లింప్స్ మాత్రమే వదిలారు చిత్ర యూనిట్. ఆ తర్వాత ప్రచార చిత్రాలు వచ్చాయి కానీ టీజర్ లాంటిది రాలేదు. ఇప్పుడు ఆ టీచర్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. మే 9న సినిమా రిలీజ్ అవ్వటం కుదరకపోతే ఆ టైం కు టీజర్ అన్న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ప్రభాస్ కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తుందని చెప్తున్నారు. కల్కి సినిమా కూడా రెండు పాదాలుగా వస్తుందని తెలుస్తుంది. కల్కి మే 9న రిలీజ్ అవ్వటం కుదరకపోతే సెకండాఫ్ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ప్రభాస్ కల్కి తర్వాత మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2025 సంక్రాంతి సీజన్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మారుతి రాజా సాబ్ తో స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరాలని అనుకుంటున్నారు. ఈ రెండు ప్రాజెక్టు తర్వాత సందీప్ వంగ డైరెక్షన్లో స్పిరిట్ అనే సినిమా కూడా ప్రభాస్ లైన్ లో ఉన్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: