సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అనేది కీలకపాత్ర వహిస్తుంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒకే రూమ్ లో ఉండి, తినడానికి తిండి లేక, ఇబ్బందులు పడుతూ ఉన్న క్రమంలో మనతోపాటు మనకు తోడుగా ఉండే వాళ్లే మన ఫ్రెండ్స్..కాబట్టి ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. నలుగురు కలిసి ఉన్నచోట ఉన్నదో, లేందో తినుకుంటూ అవకాశాల కోసం ఎదురుచూస్తూ, నిద్రలేక చాలా ఇబ్బందులు పడి చివరికి అవకాశాలు వచ్చిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఆ తర్వాత వాళ్ల ఫ్రెండ్స్ కి కూడా అవకాశాలు కల్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఫ్రెండ్షిప్ కి ఉదాహరణగా మనం త్రివిక్రమ్, సునీల్ లను చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఒక చిన్న రూమ్ లో ఉంటూ సరిగ్గా తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులను ఎదుర్కొంటూ, మొత్తానికైతే ఇప్పుడు స్టార్లుగా ఎదిగిపోయారు. ఇక ఇదిలా ఉంటే సునీల్ కోసం త్రివిక్రమ్ ఒక గొప్ప పని చేశాడు అంటూ ఇప్పుడూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే త్రివిక్రమ్ రైటర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న సమయంలో కొన్ని చిన్న సినిమాలకి రైటర్ గా పనిచేశాడు. ఇక అదే టైమ్ లో ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు త్రివిక్రమ్ ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారట. దాంతో త్రివిక్రమ్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు.
ఇక కోపానికి వచ్చిన వాళ్ళమ్మ త్రివిక్రమ్ ను ఇంటికి పిలిపించి నువ్వు పెళ్లి చేసుకుంటేనే సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతావు, లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీ ని వదిలేసేయ్ అని కరాకండి గా చెప్పిందట.దాంతో ఏం చేయాలో తెలియని డైలమాలో పడిన త్రివిక్రమ్ కొద్దిసేపు ఆలోచించాడట. తను పెళ్లి చేసుకొని ఫ్యామిలీని మైంటైన్ చేస్తూ ఉండొచ్చు, కానీ తను లేకపోతే ఇప్పుడిప్పుడే అవకాశాలని అందుకుంటున్న సునీల్ ఒంటరివాడైపోతాడనే ఉద్దేశ్యం తోనే సక్సెస్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని నిశ్చయించుకున్నాడట. దాంతో వాళ్ళ అమ్మతో నేను పెద్ద రైటర్ ని అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాడట.. ఇక ఈ విషయం తెలుసుకున్న సునీల్ తన ఫ్రెండు తన మీద చూపిస్తున్న ప్రేమకి ముగ్ధుడైపోయాడట. ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: