బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ తెర కెక్కిస్తున్న రామాయణం సినిమాపై ఇప్పటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెల కొన్నాయి.. రామాయణంలో శ్రీరాముడి గా హీరో రణ్‍బీర్ కపూర్, సీతాదేవి గా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, రావణుడి గా కన్నడ స్టార్ యశ్ ఇప్పటికే ఖరా రయ్యారు.మహా ఇతిహాసం రామాయణాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించేందుకు దర్శకుడు నితేశ్ తివారీ సిద్ధమవుతున్నారు.రామాణయణంలో కీలకమైన శ్రీరాముడి తమ్ముడు లక్ష్మణుడి పాత్ర ఎవరు చేయనున్నారు అనే విషయంపై ఆసక్తి నెల కొంది. అయితే లక్ష్మణుడి పాత్ర కోసం టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో మూవీ టీమ్ చర్చలు జరుపుతోందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.. నవీన్ ఈ పాత్రకు సూటవుతారని దర్శకుడు నితేశ్ తివారీ భావిస్తున్నట్లు సమాచారం.. లుక్ టెస్ట్ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అయితే బాలీవుడ్‍ ప్రేక్షకులకు నవీన్ పోలిశెట్టి పరిచయమే.హిందీలోనూ అతడు కొన్ని సీరియళ్లలో నటించారు. తెలుగులో ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన నవీన్.. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ చిత్రం తో హీరో గా నటించి మెప్పించారు. ఆ తరువాత జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.అయితే, 2019లో సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ నటించిన బాలీవుడ్ చిత్రం చిచోరేలో నవీన్ పోలిశెట్టి ముఖ్య పాత్రలో నటించారు.అతడి నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కాయి. అయితే చిచోరే చిత్రానికి దర్శకత్వం వహించింది నితేశ్ తివారీనే కావడం విశేషం.దీనితో రామాయణం చిత్రంలో లక్ష్మణుడి పాత్రను నవీన్ చేస్తే.. నితిన్‍తో నవీన్ కి రెండో సినిమా అవుతుంది.రామాణయం కోసం నటీనటులందరినీ మరో రెండు వారాల్లో ఫైనల్ చేయాలని దర్శకుడు నితేశ్ తివారీ నిర్ణయించుకున్నట్టు సమాచారం.. మార్చిలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు సమాచారం.నితీశ్ 'రామాయాణం'ను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: