నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి విజయాలను అందుకుంటున్నాడు.ఇక బాలయ్య బాబు తర్వాత నందమూరి ఫ్యామిలీ ని ముందుకు తీసుకెళ్లే హీరో ఎన్టీఆరే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆయన స్టార్ డమ్ ని రోజురోజుకీ విస్తరించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇక ఆయన పాన్ ఇండియా లో భారీ మార్కెట్ ను ఏర్పాటు చేసుకుంటాడు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు నాగచైతన్య… ఈయన కూడా వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాల్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఎన్టీఆర్ నాగచైతన్య ల తాతలు అయిన సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావులు కలిసి చేసిన సినిమాల్లో మిస్సమ్మ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ఇందులో ఎన్టీయార్, నాగేశ్వరరావుల పాత్రలు చాలా బాగుంటాయి.

ఇక దాంతో ఇప్పుడు కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు ఆ సినిమాని వీళ్ళిద్దరితో రీమేక్ చేయాలని చూస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ కూడా ఇంతకు ముందు ఈ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమా అనేది పోస్ట్ పోన్ అయింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. కాబట్టి నాగ చైతన్యతో కలిసి తను సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చు అంటూ మరికొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.కానీ నందమూరి, అక్కినేని అభిమానులు మాత్రం వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే చూడాలని చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. నాగార్జున, బాలకృష్ణ కలిసి ఏదైనా సినిమా చేస్తారేమో అనుకున్నారు కానీ వాళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా కూడా రాలేదు. కాబట్టి మూడోవ తరంలో అయిన వీళ్ళు కలిసి నటిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఫ్యూచర్ లో అయిన ఈ కాంబినేషన్ లో సినిమా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: