ఇండియా వ్యాప్తంగా ఆదర్శకుడి గా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుల లో శంకర్ ఒకరు . ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో దాదాపు చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి . ఇక శంకర్ దర్శకత్వం వహించిన సినిమాల్లో చాలా సినిమాలు భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను ఇండియా వ్యాప్తంగా నమోదు చేయడం తో ఈయన దర్శకత్వం కు అద్భుతమైన క్రేజ్ ఇండియా వ్యాప్తంగా లభించింది.

ఇకపోతే ఈయన చాలా రోజు ల క్రితమే కమల్ హాసన్ హీరో గా కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ కీలక పాత్రలలో అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సారథ్యం లో "ఇండియన్ 2" అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాను మొదలు పెట్టారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నీ మరికొంత కాలం లోనే విడుదల చేయడానికి ఈ మూవీ మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా హక్కులను ఓ ప్రముఖ ప్రముఖ సంస్థకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క నైజాం ఏరియా హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రయత్నాలను ఇప్పటి నుండే ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: