మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరియర్ ప్రారంభం లో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్ర లలో నటించి నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈయన ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలకమైన పాత్ర లలో ... విలన్ పాత్ర లలో అవకాశాలను దక్కించుకొని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు . ఇక ఆ తర్వాత సినిమాల్లో హీరో గా అవకాశాలను దక్కించు కొని అందులో భాగంగా హీరో గా నటించిన చాలా సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రెజియెస్ట్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు .

ఇకపోతే రవి తేజ ఎక్కువ శాతం సినిమాల ద్వారా తప్ప వేరే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడు . దానితో ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పటికీ ఇతర బిజినెస్ లపై కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు . ఇకపోతే తాజాగా రవితేజ థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇకపోతే రవితేజ , ఆసియన్ సునీల్ కలిసి దిల్ సుఖ్ నగర్ ఏరియా లో ఏసియన్ రవితేజ పేరుతో ఆరు స్క్రీన్ లతో ఓ భారీ మల్టీ ప్లెక్స్ థియేటర్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మల్టీ ప్లెక్స్ థియేటర్ ను మరి కొద్ది రోజుల్లోనే ఓపెన్ చేయబోతున్నట్లు సమాచారం. ఇలా ఇంత కాలం పాటు కేవలం సినిమాలలో నటిస్తూ ఆదాయాన్ని సంపాదించిన రవితేజ థియేటర్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: