టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఈ మూవీ మేకర్స్ ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. 

ఆ తర్వాత ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఓ సాంగ్ ను విడుదల చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా లోని రెండవ సాంగ్ అయినటువంటి "గల్లీ సందుల్లో" అంటూ సాగే ఫుల్ లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేసింది. ఇకపోతే ఈ వీడియో సాంగ్ కి ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇది ఇలా ఉంటే గోపీచంద్ ఆఖరుగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన సిటీ మార్ సినిమాతో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత పక్కా కమర్షియల్ , రామబాణం సినిమా లతో వరస అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. మరి బీమా మూవీ తో ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ సినిమాకి కన్నడ దర్శకుడు అయినటువంటి హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: