ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలను చేస్తూ మంచి జోష్ లో ఉన్నాడు. ఇప్పటి కే వరుస గా మూడు సక్సెస్ లను అందుకొని తనదైన రీతి లో ముందు కు దూసుకె ళ్తున్నాడు.ఇక బాలకృష్ణ స్టార్ హీరో అవ్వడానికి ముఖ్య భూమిక ను పోషించిన డైరెక్టర్ల లో ముగ్గురు డైరెక్టర్లు మాత్రం ముఖ్య పాత్ర పోషించారు. అందు లో ముఖ్యం గా సింగీతం శ్రీనివాసరావు ఒకరు అయితే, బి. గోపాల్ మరొకరు. మొదటగా వీరిద్దరూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను ఇవ్వడంతో బాలయ్య స్టార్ హీరో గా కొనసాగాడు.సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన భైరవద్వీపం, ఆదిత్య 369 సినిమాలు బాలయ్యను కొత్తగా ప్రజెంట్ చేస్తే బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు బాలయ్యను రౌద్ర రూపం లో ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇక బాలయ్య కెరియర్ లో డౌన్ అయిన ప్రతిసారి వీళ్ళిద్దరూ తమ సినిమాలతో మంచి బూస్టప్ ని ఇస్తూ వచ్చారు. అందువల్లే బాలకృష్ణ స్టార్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక వీళ్ల తర్వాత ఇప్పుడు బాలయ్య బాబుని మరొక మెట్టు పైకెక్కించిన డైరెక్టర్లలో బోయపాటి శ్రీను వీళ్ళ తర్వాత స్థానంలో ఉన్నాడు. ఇక వీళ్ళు ముగ్గురు లేకపోతే బాలయ్య బాబు స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకునేవాడు కాదు అంటూ చాలామంది బాలయ్య బాబు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు...   ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే మరోసారి బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాతో వరుసగా నాలుగోసారి భారీ సక్సెస్ ను కొట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: