సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా నటులు ఏదైనా క్యారెక్టర్ చేస్తే వాళ్ళకి వరుసగా అలాంటి క్యారెక్టర్ లనే ఆఫర్ చేస్తూ వాళ్ళను అందులోనే పరిమితం చేస్తూ ఉంటారు.అందుకే చాలామంది హీరోలు గానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు గానీ ఒకే రకమైన పాత్రలను కాకుండా డిఫరెంట్ పాత్రల్లో నటించడానికి సిద్దమవుతు ఉంటారు. ఇక ఇండస్ట్రీ లో అన్ని రకాల పాత్రలు పోషించే వారు చాలా తక్కువ మంది ఉన్నారు.కాబట్టి ఒకసారి ఒక నటుడు ఏదైనా పాత్ర చేశాడంటే సరిగ్గా అలాంటి పాత్ర నే వాళ్ళకి మిగతా సినిమాల్లో కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఒక హీరోయిన్ కి వరుస సినిమాల్లో చనిపోయే క్యారెక్టర్ లని ఇస్తున్నారనే ఉద్దేశ్యంతో తను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన విషయం చాలామందికి తెలియదు. ఆమె ఎవరు అంటే ప్రభాస్ తో రాఘవేంద్ర,నాగార్జునతో మన్మధుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన అన్షు.. ఈమె ఈ రెండు సినిమాల్లో కూడా తను సెకండ్ హీరోయిన్ గా నటించడమే కాకుండా రెండు సినిమాల్లో తన క్యారెక్టర్ చనిపోతుంది. దాంతో తనకి మరో రెండు మూడు సినిమాల్లో కూడా సేమ్ అలాంటి క్యారెక్టర్లు రావడంతో విసిగిపోయిన తను సినిమాల్లో నటించడం కంటే ఖాళీగా ఉన్నది బెటర్ అని తను సినిమా ఇండస్ట్రీని వదిలేసి పెళ్లి చేసుకోని లైఫ్ లో సెటిల్ అయింది.   ఇక మొత్తానికైతే ఒక స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఆమె తనకి సరైన క్యారెక్టర్ రావడం లేదనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి...ఇప్పటికైన ఇండస్ట్రీలో టాలెంట్ ను బట్టి క్యారెక్టర్లు ఇస్తే బాగుంటుంది ఒక క్యారెక్టర్ బాగా చేశారని ఆ నటులను అదే క్యారెక్టర్ లో పరిమితం చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: