ఆంధ్రప్రదేశ్లో అత్యంత హాట్ టాపిక్ గా మారినటువంటి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయం గురించి తరచు వార్తలు వైరల్ అవుతున్నాయి. అనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేయడం కోసం ప్రతి ఒక్క పార్టీ నుంచి దాదాపు ముగ్గురు నలుగురు అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీకి దిగుతున్నారు. ఇలా అనకాపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో పార్టీ అధినేతలు సైతం టికెట్ ఎవరికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉంటారనే చెప్పాలి అయితే తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయం గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ముత్యాల వెంకటేశ్వరరావు పేరు ప్రస్తుతం తెరపైకి వచ్చింది.

ముత్యాల వెంకటేశ్వరరావు అనకాపల్లి ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఈయన ప్రముఖ వ్యాపారవేతగా టెక్స్టైల్ వ్యాపారంలో గత నాలుగు దశాబ్దాలుగా దూసుకుపోతున్నారు. పెద్ద ఎత్తున ఆలయాల పునరుద్ధరణ యజ్ఞాలు హోమాలు పేదలకు సహాయం చేయడం ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా అనకాపల్లి వాసులకు ఎంతో ఆప్తుడుగా పేరు సంపాదించుకున్నటువంటి ఎంవీఆర్ పేరు తెరపైకి వచ్చింది.

ఈయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో ఎంతో మంచి సంబంధాలు ఎంవీఆర్ కు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాను తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా అధికారికంగా మాత్రం వెల్లడించడం లేదు కానీ అనకాపల్లి ఎంపీ టికెట్ మాత్రం జనసేన పార్టీకే కావాలని పవన్ కళ్యాణ్ పట్టుబట్టారట.

అనకాపల్లి నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును నిలబెట్టాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని నాగబాబు కూడా అనకాపల్లి ఎంపీ సీటు పైన చాలా ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. కానీ ఎంతో ధనవంతుడు ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి ఎంవీఆర్ కి టికెట్ ఇస్తే కనుక తమ పార్టీకి ఆర్థికంగా కూడా లాభదాయకం కలుగుతుందని అన్ని పార్టీ నేతలు ఆలోచనలో ఉన్నారు. మరి ఎం వి ఆర్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది ఆయన మనసులో ఏముంది తను ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: