సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. ఇక ఇలా విడుదలైన సినిమాలలో కొన్ని మంచి విజయాలను సాధిస్తే ఇంకొన్ని మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక ఫ్లాప్ గానే మిగిలిపోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులందరికీ ఎవర్గ్రీన్ మూవీస్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఆయా సినిమాలు విడుదల ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికి ఎందుకో సినిమా చూసినప్పుడల్లా ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అని చెప్పాలి. అలాంటి వాటిలో ఇక ఓయ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతుంది. అయినప్పటికీ ఈ మూవీకి ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికి తగ్గలేదు. ఈ సినిమా టీవీలో వస్తుంది అని తెలిసిన కూడా ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కు పోతు ఉంటారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ని చూసి తెగ ఆనంద పడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక యూత్ అందరికీ కూడా ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సినిమా ఫేవరెట్ గా ఉంటుంది. సిద్ధార్థ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్గా బేబీ షామిలి నటించింది. అందరూ హీరోల సినిమాలలో లాగా పెద్ద పెద్ద ఫైట్ సీన్లు కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేకపోయినా ఈ సినిమా అద్భుతమైన లవ్ స్టోరీ తోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది అని చెప్పాలి.


 అయితే ఇన్నేళ్ల తర్వాత ఓయ్ సినిమాను ఇటీవలే మరోసారి రి రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీలోని సంధ్య క్యారెక్టర్  కాస్ట్యూమ్స్ గురించి డైరెక్టర్ ఆనంద్ ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ మొత్తం సూర్యాస్తమయంలోని రంగులే ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. మొదట ప్రకాశవంతమైన పసుపు.. తర్వాత నారింజ తర్వాత ఎరుపు చివరికి నలుపు రంగు డ్రెస్సులని అటు హీరోయిన్ వేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ ఆనంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: