సూపర్ స్టార్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు యాడ్స్ లో నటిస్తూ మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు కారంతో హిట్టు కొట్టిన మహేష్ తరువాత రాజమౌళి సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. అది మహేష్ ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా కావడంతో ఆ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే పలు యాడ్స్ కూడా చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యునరేషన్ కూడా  భారీ రేంజ్ లో ఉంది. తాజాగా సూపర్ స్టార్ ఖాతాలో అరుదైన ఘనత చేరింది.ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లలో ఇకపై మహేష్ బాబు వాయిస్ వినిపించనుందని సమాచారం తెలుస్తోంది. ఫోన్ పే విడుదల చేసిన కొత్త యాడ్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఫోన్ పే స్మార్ట్ స్పీకర్ లో నా వాయిస్ వింటారని పేమెంట్ అలర్ట్స్, రిమైండర్స్ మరెన్నో నా వాయిస్ పై వినబోతున్నారని మహేష్ యాడ్ లో కామెంట్లు చేయడం జరిగింది.ఇక నుంచి నేను మీ బిజినెస్ టాకింగ్ పార్ట్నర్ కాబోతున్నానని సూపర్ స్టార్ మహేష్ యాడ్ లో చెప్పుకొచ్చారు. ఫోన్ పే యాప్ ఉన్న క్యూ ఆర్ కోడ్ కు డబ్బులు చెల్లించిన వాళ్లు మహేష్ బాబు వాయిస్ ను వినే ఛాన్స్ అయితే ఉంటుంది.


ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ లలో ఒకటైన ఫోన్ పేకు సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ కావడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. పైగా ఇది ఇండియాలో ఏ హీరోకి లేనటువంటి సూపర్ రికార్డ్.సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ శాంపిల్స్ ను తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వాయిస్ జనరేట్ చేశారని సమాచారం తెలుస్తుంది. ఎక్కువ సంఖ్యలో యాడ్స్ లో కనిపిస్తూ యాడ్స్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ టాప్ లో ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ ఖాతాలో ఎన్నో రేర్ రికార్డ్స్ చేరుతుండటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే మహేష్ ఫోన్ పే యాడ్ కోసం భారీ స్థాయిలోనే ఛార్జ్ చేశారని తెలుస్తోంది.త్వరలో రాజమౌళి మూవీ షూటింగ్ లో పాల్గొననున్న  మహేష్ బాబు ఈ సినిమా కోసం పూర్తిస్థాయిలో లుక్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం తెలుస్తుంది. మహేష్ రాజమౌళి కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అవుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ఇంకా ఎన్నో క్రేజీ అప్ డేట్స్  రానున్నాయని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: