తెలుగు ప్రేక్షకులకు మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ భార్యగా మెగా కోడలిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఒకవైపు కోడలిగా బాధ్యతలు చేసుకుంటూనే మరొకవైపు అపోలో హాస్పిటల్ చైర్మన్గా కూడా పలు రకాల బాధ్యతలను నిర్వహిస్తోంది.తరుచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాలను కూడా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఆమె తరచూ మీడియాలో ఏదో ఒక విషయంలో నిలుస్తూనే ఉంది.


ముఖ్యంగా ఉపాసన , రామ్ చరణ్ దంపతులు వివాహమై 11 ఏళ్ల తర్వాత ఒక పాపకు కూడా జన్మనిచ్చారు.. ఆ పాపకు క్లింకార అనే పేరు కూడా పెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఏదో ఒక విషయంలో మెగా కుటుంబంలోని ఉపాసన గురించి ఎక్కడో ఒకచోట ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా తమ కూతురికి సంబంధించి ఏదో ఒక ఫోటోని ఉపాసన రామ్ చరణ్ షేర్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఉపాసన రెండవ సంతానం గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.


అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ఉపాసన త్వరలోనే రెండో బిడ్డ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం అన్నట్లుగా తెలియజేసింది. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం పైన దృష్టి పెట్టారని.. మనల్ని మనం కాపాడుకుంటేనే ఎవరైనా పట్టించుకుంటారు ప్రతి ఒక్కరి ఆరోగ్యం పైన అవగాహన కల్పించాల్సి ఉంది.. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యానంటూ తెలిపింది నేను పిల్లల్ని ఆలస్యంగా కణాలనుకున్నాను.. అది నా ఇష్టం ఎవరి ఇష్టాలు అనుగుణంగా వారు నడుచుకుంటూ ముందుకు వెళ్లడం మంచిది.. తాను రెండవ ప్రెగ్నెన్సీకి సిద్ధంగానే ఉన్నానని చెప్పింది ఉపాసన. ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ వాక్యాల సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి రెండవ సారీ తల్లి కావడంపై ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుంది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: