సాధారణంగా ఏ ఇండస్ట్రీలో నైనా సరే క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే ..ముఖ్యంగా అవకాశాల పేరిట చాలామంది హీరోయిన్లను లొంగ తీసుకొని వారి జీవితాలను సైతం నాశనం చేస్తూ ఉంటారు.. ఇలాంటి ఎన్నో విషయాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డ హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు నిర్మాతలు దర్శకులు అడగకపోయినా సరే పడక సుఖం అందించిన హీరోయిన్ల వీడియోలు స్క్రీన్ షాట్లు తన దగ్గర ఉన్నాయంటు తెలియజేసింది ఎస్తర్ . గతంలో ఒక సినిమా ఇంటర్వ్యూలో భాగంగా ఎస్తర్ ఈ విషయాలను తెలియజేసింది.


ముఖ్యంగా ర్యాంప్ సింగర్ నోయాల్ ను ప్రేమించి మరి వివాహం చేసుకొని కేవలం మూడు నెలల వ్యవధిలోని విడాకులు తీసుకుంది ఎస్తర్.. తెలుగులో భీమవరం బుల్లోడు, 1000 అబద్దాలు, గరం ,జయ జానకి నాయక వంటి చిత్రాలలో కనిపించిన ఈమె పెద్దగా ప్రాధాన్యత అందుకోలేకపోయింది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలామంది హీరోయిన్లే పిలిచి మరి పడక ఆఫర్లు ఇస్తున్నారని అలాంటి హీరోయిన్లు తాను చూసానని ఆఫరిస్తే ఏ పని చేయడానికి అయినా సిద్ధమేనని నాతో చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారని తెలిపింది ఎస్తర్.


ముఖ్యంగా ఇండస్ట్రీలో మగాళ్లు అడగకుండానే ఆడవాళ్లే ఆఫర్ చేయడం అనేది కూడా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అంటు తెలిపారు.. 99 శాతం మంది ఇలాగే చేస్తూ ఉండడంతో మిగిలిన ఆ ఒక్క శాతం లో కూడా అందరిని కలిపేస్తున్నారంటూ ఎస్తర్ తెలిపింది.. తనతో కూడా చాలామంది అసహ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయంటు తెలియజేసింది.. టాలెంట్ ఉన్నప్పటికీ తనకు ఆఫర్లు రాకపోవడానికి ముఖ్య కారణం క్యాస్టింగ్ కౌచ్ అంటూ కూడా తెలియజేసింది ఎస్తర్.. ఇటీవలే పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తోంది. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయినా ఎస్తర్.. పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో మాత్రం నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమాలో కూడా నటించింది

మరింత సమాచారం తెలుసుకోండి: