సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా జూన్ నుంచి మొదలవుతుందని తెలుస్తుండగా ఈ సినిమా కోసం సమ్మర్ 3 నెలలు మహేష్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మహేష్ రాజమౌళి ఈ కాంబో సినిమా కోసం ఆడియన్స్ అంతా కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ కొత్త మేకోవర్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ లుక్ విషయంలో యాక్షన్ షురూ చేయగా రానున్న 3 నెలల్లో మహేష్ తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ మీద దృష్టి పెట్టాడని తెలుస్తుంది.

సమ్మర్ 3 నెలలు కూడా మహేష్ చాలా కష్టపడాలని ఫిక్స్ అయ్యాడట. సూపర్ స్టార్ మహేష్ సరికొత్త లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది. ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా కోసం రాజమౌళి వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. సినిమా కోసం మహేష్ 2, 3 ఏళ్ల టైం కేటాయించాలని ఫిక్స్ అయ్యాడట. తప్పకుండా ఈ కాంబో సినిమా వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ సృష్టిస్తుందని అంటున్నారు.

సమ్మర్ లో మహేష్ 3 నెలల్లో తను ఇదివరకు కమిట్ మెంట్ ఇచ్చిన యాడ్స్ ని కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. రాజమౌళి సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఇక మీదట ఎలాంటి యాడ్స్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. మహేష్ రాజమౌళి ఈ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని మెప్పించేలా ఖుషి చేయనుందని తెలుస్తుంది. ఈ సినిమా లో మిగతా కాస్టింగ్ అన్ని డీటైల్స్ త్వరలో రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తారని తెలుస్తుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ లతో సూపర్ ఖుషిగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: