సంక్రాంతి రేసు ముగిసిందనుకుంటుండగా స్టార్ సినిమాల సమ్మర్ రేసు కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమ్మర్ కి ముందే సినిమాల మధ్య ఫైట్ జరుగుతుంది. ముఖ్యంగా మార్చ్ నెలలో యువ హీరోల సినిమాల మధ్య గట్టి పోటీ నడుస్తుంది. మార్చ్ 1 నుంచి 29 వరకు సినిమాల సందడి షురూ కానుంది. మార్చ్ 1న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. ఇక అదే రోజు వెన్నెల కిశోర్ లీడ్ రోల్ లో నటించిన చారి 111 సినిమా వస్తుంది.

మార్చ్ 1న మరో 3 సినిమాలు బూతద్ధం భాస్కర్ నారాయన, వ్యూహం, రజకార్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక మార్చ్ 8న గోపీచంద్ భీమా వస్తుంది. అదేరోజు ఉత్సవం, శపధం, గామి సినిమాలు వస్తున్నాయి. గామి సినిమాలో విశ్వక్ సేన్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. సినిమాకు అతనే క్రౌడ్ ఫుల్లర్ పాయింట్ అని చెప్పొచ్చు.

మార్చ్ 22న ఆ ఒక్కటి అడక్కు అంటూ మరోసారి అల్లరి నరేష్ తన మార్క్ కామెడీ మూవీతో వస్తున్నారు. అదే రోజు శ్రీ విష్ణు ఓం భీం బుష్ అంటూ రాబోతున్నాడు. కలియుగం పట్టణంలో సినిమా కూడా ఆరోజే రిలీజ్ అవుతుంది. ఇక మార్చ్ 29న టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో వస్తున్న టిల్లు స్క్వేర్ మీద ఉన్న అంచనాలు తెలిసిందే. డీజే టిల్లు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై యూత్ లో భారీ బజ్ ఉంది. మరి ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. మార్చ్ నెల మొత్తం యువ హీరోల సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: