పాయల్ రాజ్ పుత్ అజయ్ భూపతి ఈ కాంబినేషన్ అంటే అందరికీ ఆరెక్స్ 100 గుర్తొస్తుంది. ఆ సినిమాతోనే పాయల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే ఆ సినిమా తర్వాత సినిమాలైతే చేసింది కానీ పాయల్ రేంజ్ పెంచే ప్రాజెక్ట్ లు పడలేదు. అందుకే మళ్లీ ఆ బాధ్యత మీద వేసుకున్న అజయ్ భూపతి ఆమెతో మంగళవారం అనే సినిమా చేశాడు. ఈ సినిమా నవంబర్ 17న థియేట్రికల్ రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. పాయల్ నుంచి ఈ రేంజ్ యాక్టింగ్ ఊహించని ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు.

సినిమాను ఏ క్రియేటివ్ వర్క్స్ తో పాటు ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ కలిసి నిర్మించింది. స్వాతి, సురేష్ వర్మ నిర్మాతలుగా వ్యవహరించారు. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా రీసెంట్ గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైంది. ఊహించని విధంగా మంగళవారం సినిమాకు మంచి రేటింగ్ వచ్చింది. స్టార్ మా లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా కు 7.21 రేటింగ్ వచ్చింది. స్టార్ సినిమాలకు కూడా ఈ రేంజ్ రేటింగ్ కొన్ని సినిమాలకు రాలేదు.

స్టార్ మా భారీ ధరకే మంగళవారం శాటిలైట్ రైట్స్ దక్కించుకోగా అందుకు తగినట్టుగానే సినిమా రేటింగ్ వచ్చిందని చెప్పొచ్చు. మంగళవారం తెలుగు తో పాటు గా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా రిలీజైంది. ఈ సినిమాకు కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. తన విజన్ ని తెర మీద చూపించడం లో సక్సెస్ అయిన అజయ్ భూపతి మంగళవారం సినిమాతో సక్సెస్ అందుకున్నారు. సినిమా బుల్లితెర మీద కూడా మంచి రేటింగ్ తెచ్చుకుని అక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: