ఇటీవల కాలంలో ఏదైనా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది అంటే ఇక ఆ సినిమాకు సీక్వల్ తీసి మరో హిట్టు కొట్టాలని దర్శక నిర్మాతలు  కూడా ఆశపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇలా సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మూవీపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి అంచనాల మధ్య విడుదలైన సినిమాలు కాస్త అటు ఇటుగా ఉన్న సూపర్ హిట్ అవడం చూస్తూ ఉంటాం. అయితే ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఇలాంటి ఒక సీక్వెల్ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది.


 హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. నిర్మాతలకు లాభాల పంట పండించింది అని చెప్పాలి. అయితే ఈ సూపర్ హిట్ మూవీకి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సీక్వెల్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక ఇటీవల సీక్వెల్ కు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఈ సీక్వెల్ సినిమా గురించి నిర్మాత, రచయిత అయిన కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 గతంలో ఆది పురుష్ సినిమా సమయంలో థియేటర్లలో హనుమంతుడు గురించి ఒక సీటు వదిలేసినట్లుగానే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకి థియేటర్లలో ఒక సీట్ వదిలేస్తారా అంటూ రిపోర్టర్ ప్రశ్నించగా.. ఫన్నీ రిప్లై ఇచ్చాడు నిర్మాత కోన వెంకట్.. మీరు ఇచ్చిన ఐడియా బాగుంది. కానీ ఇలా వదిలేసిన సీట్లలో నిజంగానే ఆత్మ వచ్చి కూర్చుంటేనే అసలు ప్రాబ్లం అంటూ రిప్లై ఇవ్వడంతో అక్కడ ఉన్న మిగతా రిపోర్టర్స్ అందరూ కూడా నవ్వుకున్నారు. కాగా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు రచయితగా పనిచేసారు కోన వెంకట్.

మరింత సమాచారం తెలుసుకోండి: