ఇప్పటివరకు రామాయణం నేపథ్యంలో ఎన్నో సినిమాలు తెరకెక్కి  ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇలాంటి సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే విజయం సాధించాయ్ అని చెప్పాలి ఇంకొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించకపోవడమే కాదు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాయి. అయితే అయితే గతంలో ఇలా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో చాలా సినిమాలు  వచ్చేవి. కానీ ఇటీవల కాలంలో ఇలాంటి వాటిపై రిస్క్ చేయడానికి పెద్దగా డైరెక్టర్లు ఆసక్తి చూపించడం లేదు. అయితే మొన్నటికి మొన్న ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో ఓం రౌత్ అనే ఒక స్టార్ డైరెక్టర్ ఆది పురుష్ అనే సినిమాను తీశాడు.


 అయితే రామాయణం ఇతిహాసం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అంతేకాదు తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ మూవీ ద్వారా డైరెక్టర్ ఓమ్ రౌత్ రామాయణాన్ని వక్రీకరించాడు అంటూ అందరూ విమర్శలు చేశారు. అయితే ఈ మూవీ తర్వాత నేటి తరంలో దర్శకులు ఎవరు కూడా మరోసారి రామాయణం నేపథ్యంలో సినిమా తీయడానికి సాహసం చేయరేమో అని అనుకున్నారు. కానీ అంతలోనే ఏకంగా బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి రామాయణం తెరకెక్కిస్తున్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఇందులో ఏకంగా రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


 రావణాసురుడి పాత్రలో అటు కోలీవుడ్ స్టార్ హీరో యష్ నటించబోతున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీలోని ప్రతిపాత్రకు ఏ ఏ నటుడు అయితే బాగుంటుంది అనే విషయంపై ఇక ఎన్నో ఊహాగానాలు కూడా తెరమీదికి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ఈ సినిమాలో ఏకంగా లక్ష్మణుడి పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని ఎంపిక చేయబోతున్నారు అంటూ ఒక టాక్ తెరమీదకి వచ్చింది. మూవీ టీం అతనితో చర్చలు జరుపుతుందట. లుక్ టెస్ట్ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వస్తుంది అని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: