పవన్ కల్యాణ్ 'సుస్వాగతం' సినిమాలో రఘువరన్ పోషించిన పాత్ర మొదట శోభన్ బాబు దగ్గరికి వెళ్లింది. అందుకు భీమినేని శ్రీనివాసరావు సంప్రదించగా అప్పుడు కూడా శోభన్‌బాబు నో చెప్పారు.తెలుగు సినిమా చరిత్రంలో అన్నమయ్య చిరస్థాయిలో ఉంటుంది. నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం 1997లో విడుదల అయింది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్‌ను అందుకుంది. ఇందులో శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించమని చిత్ర యూనిట్ కోరగా అప్పుడు కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా ఫైనల్‌గా ఆ పాత్ర సుమన్ వద్దకు వెళ్లింది. అందులో ఆయన కూడా ఒదిగిపోయాడు.బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ నటించిన 'బ్లాక్' తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు ఆర్.బి. చౌదరి. అందులో శోభన్ బాబు అయితే బాగా సెట్ అవుతారని ఆయన కోరారు. అందకు కూడా నో చెప్పారు శోభన్ బాబు.అలా ఎన్నో హిట్ కొట్టిన సినిమాలు ఆయన వద్దకు వచ్చాయి. కానీ వాటిని తిరస్కరించిన శోభన్ బాబు ఎట్టకేలకు ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోడి రామకృష్ణ దర్శకుడిగా నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ రూపొందించాలనుకున్న మల్టీస్టారర్ చిత్రాన్ని ఆయన ఓకే చేశారు. అందులో శోభన్ బాబు,కృష్ణ, జగపతి బాబు కలిసి నటించాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి