ఆశిష్ రెడ్డి రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈ వేడుకకు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అయితే వీరిద్దరూ కలిసి వచ్చినట్లుగా లేదు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి కొత్త జంటకు విషెస్ తెలిపారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరూ కలిసి వచ్చారని రూమర్స్ వస్తున్నాయి. మనకు తెలిసిందే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య లవ్ ఎఫైర్ ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రిసెప్షన్ కు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కలిసి వచ్చారని రూమర్స్ వైరల్ గా మారాయి. రష్మిక మందన, విజయ్ దేవరకొండ జంటకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇద్దరి కాంబినేషన్లో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చాయి.
అయితే వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై రష్మిక విజయ్ దేవరకొండ ఎక్కడ స్పందించలేదు కానీ కొన్నిసార్లు అది రుజువు అయింది. ఈ క్రమంలోనే మరోసారి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారని అందుకే రిసెప్షన్ కు కలిసి వచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇక దిల్ రాజ్ సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి తెలుగులో రౌడీ బాయ్స్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. 2022 లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆశిష్ రెడ్డి సెల్ఫీస్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి విశాల్ కాళీ దర్శకత్వం వహిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి