మహేష్ రాజమౌళి కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ కాంబినేషన్ కోసం చాలామంది ఫ్యాన్స్ , సినీ సెలబ్రిటీలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే రోజురోజుకి ఈ సినిమా గురించి ఏదో ఒక విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కూతురు సీతారను కూడా ఈ సినిమాతో లాంచ్ చేయబోతున్నట్లు అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా సితార కూడా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండటమే కాకుండా పలు రకాల యాడ్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.


మహేష్ బాబు నటించిన మొట్టమొదటి పాన్ వరల్డ్ సినిమా కావడం చేత ఈ సినిమాతోనే సీతారను కూడా లాంచ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ట్రైనింగ్ కోసం జర్మనీకి కూడా మహేష్ బాబు వెళ్లారు నాలుగైదు నెలల పాటు ఈ వర్క్ షాప్ అక్కడే ఉంటుందని సమాచారం. ఈ వర్క్ షాప్ లో మహేష్ తో పాటు సితార కూడా పాల్గొనేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


రాజమౌళి ఏ రేంజ్ లో సినిమాని ప్లాన్ చేసి ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఇంతటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రాజమౌళి సీతార లాంచ్ చేస్తే కచ్చితంగా పాపులారిటీ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో ఏదైనా కీలకమైన పాత్ర ఇస్తే తప్పదని కూడా తెలుస్తోంది. చిన్న వయసులోనే డ్యాన్సులతో అదరగొట్టేస్తున్న సితార..సూపర్ స్టార్ మహేష్ బాబు వారసత్వాన్ని మహేష్ కుమారుడు గౌతమ్ కొనసాగిస్తూ ఉన్నారు.. మరి సితార కూడా ఎంట్రి ఇచ్చి సక్సెస్ అవుతుందా లేకపోతే వ్యాపార రంగం వైపు అడుగు వేస్తుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: