మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం ఈగల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని మొదట ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా సంక్రాంతి రెస్ నుండి తప్పుకొని ఫిబ్రవరి 9.వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఆ తర్వాత చెప్పినట్లు గానే ఈ మూవీ ని ఫిబ్రవరి 9 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించి యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి ఈటీవీ సంస్థ దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా కొన్ని రోజుల తర్వాత నుండి ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు అందులో కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీ ఛానల్ లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ఈటీవీ విన్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: