ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలలో గేమ్ చేంజర్ మూవీ ఒకటి. ఈ మూవీ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటిస్తూ ఉండగా ... దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలలో నటిస్తూ ఉండగా ... కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. కాకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరో ఒకటి , రెండు నెలలలో ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు ... ఆ తర్వాత మరో ఒకటి , రెండు నెలలలో ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఈ మూవీ బృందం పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలా మరో నాలుగు , ఐదు నెలల్లో ఈ సినిమా యొక్క మొత్తం పనులు ముగిసే అవకాశం ఉండడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న చరణ్ , శంకర్ కాంబో లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rc