'బాహుబలి' సిరీస్ తరువాత వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి 'సలార్' సినిమా కొంచెం ఊరట కలిగించింది. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్టు కాకున్నా ఓ మోస్తారు హిట్ అయ్యింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి యావరేజ్ హిట్టుగా నిలిచింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా 'కల్కి2898 AD' సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా వాయిదా అంటూ గత కొన్నిరోజుల నుంచి అభిమానులు, సినీ ప్రేమికుల మధ్య డిస్కషన్ నడుస్తుంది.దీంతో ఫ్యాన్స్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో విడుదల తేదీ పుకార్లపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చేసింది.'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అలా చాలా ఏళ్ల క్రితమే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ కమిట్ అయ్యాడు.


కాకపోతే మిగతా చిత్రాల వల్ల ఇది లేట్ అవుతూ వచ్చింది. ఏడాదిన్నర క్రితం నుంచి మాత్రం గ్యాప్ ఇస్తూనే షూటింగ్ చేస్తూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం టీజర్ లాంటి వీడియో ఒకటి రిలీజ్ చేసి హైప్ పెంచారు.ఈ మధ్య కాలంలో అయితే 'కల్కి' చిత్రంలో నాని, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలామంది స్టార్ హీరోలు నటిస్తున్నారని, ఏకంగా 9 భాగాల ఫ్రాంచైజీగా దీన్ని తీయబోతున్నారని ఇలా ఇలా అంచనాలు పెంచే మాటలు చాలా వినిపించాయి. అదే టైంలో చాలారోజుల క్రితమే ప్రకటించినట్లు మే 9న ఈ సినిమా థియేటర్లలోకి రాకపోవచ్చనే టాక్ వినిపించింది.అయితే ఇదంతా చూస్తూ వచ్చిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. ఎ‍ట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెబుతూ.. ప్రభాస్ కాలు చూపిస్తున్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో రూమర్స్‌కి చెక్ పడినట్లయింది. అందువల్ల ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.ఈ వేసవిలో వస్తున్న ఏకైక స్టార్ హీరో సినిమా ప్రభాస్ 'కల్కి'నే కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: