సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల వారసులు సినిమా రంగంలోకి వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్ల పిల్లలు ఎంతో మంది వచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని బాషలలో కూడా స్టార్ కిడ్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయి దూసుకుపోతున్నారు. అలాగే స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి పిల్లలు ముందుగా చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి హీరోలుగా మారి ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే ఈ విధంగానే అల్లు అర్జున్ కొడుకు కూడా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

 కానీ చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు గారాలపట్టి అర్హను టాలీవుడ్ స్క్రీన్‌పై పరిచయం చేశాడు బన్నీ. ఆమె వీడియోలు, ఆ హస్కీ మాటలను సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి.తండ్రితో పాటు తనకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అర్హ. ఇకపోతే సినిమా షూటింగ్ గ్యాప్‌ వస్తే ఫ్యామిలీతో, పిల్లలతోనే ఎక్కువ సమయం గడుపుతాడు బన్నీ. అంతే కాదు సినిమా సినిమా గ్యాప్‌లో పిల్లలు, వైఫ్‌తో వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటాడు స్టైలీష్‌ స్టార్. అందుకే వాళ్లతో ఉన్న ఫోటోలను రెగ్యులర్‌గా

ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటాడు. కాగా అయాన్ లో సింగింగ్ టాలెంట్ కూడా ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది. అయాన్ పాట పడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ చిత్రంలోని ‘లుట్ ఫుట్ గయా’ సాంగ్ కి పాడాడు. అయాన్ క్యూట్ వీడియో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్… మురిసిపోతున్నారు. అయాన్ సింగర్ కూడానా… అని కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ నట వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ని దున్నేయడం ఖాయం అంటున్నారు. స్నేహారెడ్డి తరచుగా తన పిల్లల టాలెంట్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: