యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ తాజాగా గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన కంప్లైట్ తో షణ్ముఖ్ సోదరుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు షణ్ముక్ గంజాయి తాగుతూ కనిపించాడు. అతని దగ్గర మరో 16 గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. షణ్ముక్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన సోదరుడు సంపత్‌ను కూడా పట్టుకున్నారు.

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి హర్ష చేసిన 'వైవా' సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే కదా. ఈ సిరీస్ లో హర్ష తనదైన కామెడీ, డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని ఆకట్టుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. తాను నటించిన మొదటి సిరీస్ 'వైవా'ని ఇంటిపేరుగా మార్చుకొని వైవా హర్షగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు హీరోగా మారి 'సుందరం మాస్టర్' అనే సినిమాలో నటించాడు. ఫిబ్రవరి 23న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ సొంతం చేసుకోగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైవా హర్ష యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

" షన్ను నేను మా ఇద్దరి ఈక్వేషన్ చాలా స్ట్రాంగ్ అతను నన్ను తన ఎల్డర్ బ్రదర్ లా ట్రీట్ చేస్తాడు. వాడు ఎప్పటికీ నా యంగర్ బ్రదరే. సొంత అన్నదమ్ముల్లా పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓ నాలుగైదేళ్లు కలిసి ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. అలా అని అది పెద్ద కాంప్లికేటెడ్ ఏమీ కాదు. నేను సెపరేట్ ఛానెల్ పెట్టుకుంటాను, సెపరేట్ వే చూసుకుంటానని చెప్పడం.. అలాంటి చిన్న చిన్న ఇష్యుస్ వచ్చాయి. కానీ ఈ రోజు ఆ టీమ్ అంతా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వైవా లో మేము షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కంటెంట్ ప్రొడక్షన్ టైం నుంచి వాళ్లంతా టాలెంట్ తో మంచి అవకాశాలు అందుకున్నారు. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించారుమ్ ఆ తర్వాత ఫీచర్ ఫిల్మ్స్.. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కింద సెట్ అయిపోయారు" అని అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: