టాలీవుడ్ లో కమెడియన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ హీరోగా కూడా మెప్పించారు. కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసుకు వెళ్లిన సుధాకర్ కి దర్శకుడు భారతీరాజాతో పరిచయం ఏర్పడింది. ఆయన సుధాకర్‌ను హీరోగా పెట్టి 'కిళుక్కెమ్‌ పొగుమ్‌ రెయిల్' సినిమా తీశారు. అందులో సుధాకర్ కి జోడిగా రాధిక హీరోయిన్‌ గా నటించింది. ఈ సినిమా హిట్‌ కావడంతో వీరి కాంబినేషన్‌ లో పలు సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగులో ఎక్కువ అవకాశాలు రావడంతో హైదరాబాద్ కు వచ్చారు. ఇక ఇక్కడ కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అగ్ర హీరోల సినిమాల్లో రాణించారు.

సుధాకర్ కుమారుడి వివాహానికి సంబంధించిన ఫోటోలను చూసిన నెటిజన్స్ సుధాకర్ పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలో సుధాకర్ చాలా బక్కచిక్కిపోయి పోయి నడవలేని స్థితిలో ఉన్నారు. నడవలేని స్థితిలో ఉన్న సుధాకర్ ని ఇద్దరి సాయంతో స్టేజ్ పైకి తీసుకువచ్చారు. ఈ ఫోటోల్లో సుధాకర్ చాలా నీరసంగా కనిపించడంతో ఒకప్పుడు అందరినీ కడుపుబ్బా నవ్వించిన సుధాకర్ ఇప్పుడు ఇలా మారిపోయారేంటీ? అని అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

సుధాకర్ కమెడియన్, బ్రహ్మానందం ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక తన స్నేహితుడి కుమారుడి పెళ్లిని బ్రహ్మానందం దగ్గరుండి మరీ జరిపించారు. పెళ్లి పనులు మొదలైనప్పటి ముగిసే వరకు అంతా తానై వ్యవహరించారు. అంతేకాదు పెళ్లిలో తనదైన శైలిలో నూతన దంపతులతో జోకులు వేస్తూ వచ్చిన అతిధులు అందరిని ఎంతగానో నవ్వించారు. అందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. కాగా సుధాకర్ ఏకైక కుమారుడు బెనెడిక్ట్ మైకేల్(బెన్ని) వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ వివాహ వేడుకకి బ్రహ్మానందం తో పాటు సీనియర్ నటుడు జగపతిబాబు, జె.డి చక్రవర్తి, రోజా రమణి, చంద్రబోస్ దంపతులు సహా మరికొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: