తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది కూడా ఒకరు ప్రస్తుతం ఈయన వయసు 33 సంవత్సరాలు.. ఇప్పటికి వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంటున్నారు.. అయితే తన తోటి కమెడియన్స్ అయిన రాంప్రసాద్ గెటప్ శ్రీను వంటి వారు ఇప్పటికి వివాహం చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు.. అయితే హైపర్ ఆది వంటి వారు ఇంకా వివాహం చేసుకోలేదని చర్చ ఇప్పుడు బుల్లితెర పైన నడుస్తోంది. ఈ క్రమంలోనే హైపర్ ఆది గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. హైపర్ ఆది జాతకంలో దోషం ఉందని అందుకే వివాహం కాలేదని ఆ దోష నివారణకు ఒకటే మార్గం ఉందంటూ అది హైపర్ ఆది ఒప్పుకుంటారా లేదా అనేది ఒక సమస్యగా మారుతోందట.


హైపర్ ఆదికి ముందు వివాహం కావాలి అంటే ముందుగా ఒక వృద్ధురాలిని పెళ్లి చేసుకోవాలని తన జాతకంలో దోషం ఉందట.. అప్పుడు హైపర్ ఆది నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు అంటూ తాగుబోతు రమేష్ శ్రీదేవి డ్రామా కంపెనీలో తెలియజేశారు.. అయితే ఇదంతా స్కిట్ లోని భాగమే అన్నట్టుగా తెలుస్తుంది హైపర్ ఆది కోసం ఇద్దరు వృద్ధ మహిళలను తాగుబోతు రమేష్ అరేంజ్ చేశారు .. కానీ ఇందులో ఏ ఒక్కరు కూడా హైపర్ ఆదిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు.

దీంతో ఈ స్కిట్ తో అటు ప్రేక్షకులను సైతం తాగుబోతు రమేష్ కడుపుబ్బ నవ్వించారు. హైపర్ ఆది జబర్దస్త్ గుడ్ బై చెప్పేశారు.. ఢీ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటిసోలలో మాత్రమే కనిపిస్తూ ఉంటారు అలాగే పలు సినిమాలలో కమెడియన్ గా బాగానే రాణిస్తున్నారు.. పొలిటికల్ పరంగా జనసేన పార్టీ కి సీటు ఇస్తే ఎన్నికలలో పోటీ చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నాను అంటూ హైపర్ ఆది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో  టికెట్టు ఇస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: