టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న తమన్నా ఇటీవల కాలంలో అటు బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంటోంది.. ఇదంతా ఇలా ఉంటే తమన్నా పేరు ఇది కాదట.. కొన్ని కారణాల చేత తన పేరును సైతం మార్చుకున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. తమన్నా తన సినీ కెరీర్ ని ప్రారంభించి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైనే కావస్తున్నప్పటికీ అప్పటికీ ఇప్పటికీ తన గ్లామర్ విషయంలో ఎలాంటి మార్పు లేదు..


తమన్నా అంటే హిందీలో కోరిక అని అర్థం వస్తుందట. తమన్నా ఎనిమిది ఏళ్ల వయసు ఉన్నప్పుడే హీరోయిన్ కావాలనుకుందని అనుకున్నట్లుగానే టీనేజ్ వచ్చేసరికి మోడలింగ్ వైపుగా అడుగులు వేసిందట.. అయితే ఇండస్ట్రీలో అడుగు పెడదామనుకున్న సమయంలో ఒకాయన తమన్నా కలిశారట. అయితే తమన్నా పేరులోనే మార్పు చేయమని తనకు సూచించారట.. ఇంగ్లీషులో తమన్నా పేరులో అదనంగా ah అనే పదాన్ని జోడించమంటు సలహా ఇచ్చారట.


దీంతో తమన్నా పేరు ఇంగ్లీషులో tamannaah గా మారిపోయిందట. ఈ పేరు మార్పు అనేది తమ్మన్నా లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ని తీసుకువచ్చిందని తెలుస్తోంది. కెరియర్ పరంగా కూడా తమన్నా కు బాగా కలిసొచ్చిన పేరుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఒక్క చిత్రానికి టాలీవుడ్ లో సుమారుగా రూ .5 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. చివరిగా జైలర్ సినిమాలో నటించింది చిన్న పాత్రలలోనైనా సరే తమన్నా క్రేజ్ భారీగానే అందుకున్నది. ప్రస్తుతం ఎక్కువగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమిస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలైతే వినిపిస్తున్నాయి ఇద్దరూ కూడా చట్టపట్టలేనిసుకొని తిరుగుతున్నట్టుగా పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.కానీ ఇప్పటివరకు ఈ విషయం పైన ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: