తెలుగు ప్రేక్షకులకు నటి అన్నపూర్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు.. మూడేళ్ల వయసులో నుంచి నాటకాలలో నటించిందట. చిన్న వయసులోనే వెండితెర పైన సందడి చేసిన అన్నపూర్ణ ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తూనే ఉంది.. ప్రస్తుతం ఈమె బామ్మ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంది. అంతేకాకుండా అప్పుడప్పుడు బుల్లితెర పైన పలు షో లలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల అన్నపూర్ణ ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఎక్స్పోజింగ్ చాలా ఎక్కువ అయిందని విధంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.


అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్లు బయటికి వచ్చేవారా.. ఆడదానికి ఎందుకు స్వతంత్రం కావాలి.. రాత్రి 12 గంటల తర్వాత ఏం పని .. చాలామంది  చిన్న చిన్న బట్టలలో చాలా ఎక్స్పోజింగ్ గా కనిపిస్తున్నారని.. ఎవరు మనల్ని ఏం అనకూడదనుకున్న అందరూ మనల్ని  ఏదో ఒకటి అనేట్టుగానే రెడీ అవుతున్నారు అంటూ తెలుపుతోంది.. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళది తప్పు అనకూడదు మన వైపు కూడా కాస్త ఆలోచించాలి అంటూ చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.


ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలను సైతం నటి చిన్మయి ఖండించింది నేను ఆమెకు పెద్ద అభిమానిని ఆమె ఇలాంటి అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటే నా గుండె ముక్కలు అయింది అంటూ తెలిపింది.. అయితే ఆమె చెప్పిన దాని ప్రకారం ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిన యాక్సిడెంట్ అయిన సూర్యోదయం సూర్యాస్తమానికి మధ్యలోనే జరగాలి ఆ తర్వాత లేడీ డాక్టర్స్ నర్సులు కూడా ఉండకూడదు అని అర్థరాత్రి పిల్లలు కూడా పుట్టకూడదని.. మహిళలకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే రాత్రిపూట వెళ్లిన మహిళ డాక్టర్లు ఉండకూడదు.. రాత్రి ఆరు నుంచి ఉదయం ఆరు వరకు మగ డాక్టర్లే  ఉంటారు కనుక ఎలాంటి పనులు చేయకూడదు అంటూ తెలుపుతోంది. అంతేకాకుండా చాలామంది ఉదయం 3 గంటలకే లేచి పొలం గట్టున వెళ్లి ఆడవాళ్లు కూడా ఇంకా ఉన్నారు. చాలామంది ఊర్లలో బాత్రూమ్స్ లో లేవు.. ఇలాంటి సందర్భాలలో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారో వారి పైన ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడదామా అని చాలామంది ఎదురుచూస్తున్న సమాజం ఇది అమ్మాయిల వేషధారణ వల్లే అఘాయిత్యాలు జరుగుతాయని చెప్పడం చాలా బాధాకరం దీన్నిబట్టి చేస్తే అమ్మాయిలు భారతదేశంలో పుట్టడం మన కర్మ అంటూ తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: