ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచమంతా పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య ఎలాంటి తేడా లేకుండా పోయింది. అయితే ఇలాంటి తేడా ఏదైనా ఉంది అంటే కేవలం ఒక బ్లూటూత్ మాత్రమే అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలోనే ఒకప్పుడు సినీ సెలబ్రిటీలను కలవడానికి ఎక్కడో దూరప్రాంతాలలో జరుగుతున్న షూటింగ్స్ స్పాట్ కి వెళ్లి గంటల తరబడి వేచి చూసి.. ఇక అభిమాన సెలబ్రిటీలను కలిసేందుకు  ఎంతో మంది ప్రయత్నించేవారు   ఇక గంటల తరబడి వేచి చూసిన కలిసే ఛాన్స్ వస్తుందో లేదో కూడా చెప్పలేని విధంగా ఉండేది.


 కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కారణంగా ఏకంగా తమ అభిమాన సినీ  సెలబ్రిటీలతో సోషల్ మీడియా వేదికగా నేరుగా మాట్లాడగలుగుతున్నారు ప్రేక్షకులు. అయితే సినీ సెలబ్రిటీలు కూడా అభిమానులతో అప్పుడప్పుడు ఇంటర్నెట్లో చిట్ చాట్ నిర్వహిస్తున్నారు. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా ఓపికగా సమాధానాలు చెబుతూ ఉండడం గమనార్హం. అయితే కొన్ని కొన్ని సార్లు అటు సినీ సెలబ్రిటీలకు అభిమానుల నుంచి వింత ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయని చెప్పాలి. ఇలాంటి వింత ప్రశ్నలకు కొంతమంది కాస్త ఇబ్బంది పడితే.. ఇంకొంత మంది మాత్రం సరైన సమాధానం చెబుతూ ఉంటారు.

 అయితే తన అందం అభినయంతో ఎంతో మంది కుర్ర కారు మతి పోగొట్టి ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది ప్రియాంక అరుల్ మోహన్.. ఇక ఇటీవల తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే అభిమాని ఒక వింత కోరిక కోరితే చివరికి హీరోయిన్ తీర్చేసింది. మీ గోర్లు చూపించండి మేడం అంటూ అడిగాడు అభిమాని   అయితే దీనికి బదులు ఇచ్చిన ప్రియాంక అరుల్ మోహన్ తన చేతిని ఫోటో తీసి పోస్ట్ చేసింది. ఇక మరో అభిమాని పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పండి అంటూ ప్రశ్నిస్తే.. ఆయన ఒక లెజెండ్, అద్భుతమైన మనిషి, గొప్ప లీటర్, రియల్ పవర్ స్టార్ అంటూ బదులిచ్చింది ప్రియాంక అరుల్ మోహన్.

మరింత సమాచారం తెలుసుకోండి: