పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రస్తుతం సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన సినిమాలతో అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు ఈ హీరో. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హీరోగా కూడా కొనసాగుతూ వున్నాడు అనే విషయం తెలిసిందే. ఇక వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగానే ఉన్నాడు  అయితే బాహుబలి సినిమా తర్వాత పెద్దగా హిట్ అందుకొని ప్రభాస్ ఇటీవల సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అన్న విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత అభిమానుల ఆకలి తీర్చాడు ఈ పాన్ ఇండియ హీరో.


 ఇక ఇప్పుడు కల్కి అనే సినిమాతో బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మూవీపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు సినిమాల గురించి కాకుండా ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ప్రభాస్ ఇటీవలే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడట. అదేంటి ప్రభాస్ కు ఇల్లు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది. అతనికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇక కొన్ని కోట్లు పెట్టి తన అభిరుచులకు తగ్గట్లుగా ఏకంగా ఇల్లు కూడా కట్టుకోవచ్చు. అలాంటిది ప్రభాస్ ఎందుకు రెంటుకు తీసుకుంటాడు అని అనుకుంటున్నారు కదా. అయితే ప్రభాస్ ఇల్లును రెంటుకు తీసుకుంది మన దేశంలో కాదు ఏకంగా లండన్లో.


 అయితే లండన్ లో ప్రభాస్ ఇలా అద్దెకు తీసుకున్న విలాసవంతమైన భావనానికి ప్రతినెల ఎంత మొత్తంలో చెల్లిస్తున్నాడు అన్న విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా లండన్ లోని ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన ఇంటిని అద్దెకు తీసుకున్నాడట ప్రభాస్. ఎప్పుడైనా లండన్ కు వెళ్ళినప్పుడు అక్కడే ఉండేందుకు సౌకర్యవంతంగా ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇలా ప్రభాస్ రెంటుకి తీసుకున్న విలాసవంతమైన భావనానికి ప్రతి నెల ఏకంగా 66 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తూ ఉన్నాడట ఈ పాన్ ఇండియా హీరో. ఈ విషయం తెలిసి అభిమానులందరూ కూడా నోరేళ్లు పెడుతున్నారు. ఎప్పుడో ఒకసారి వెళ్లి వచ్చేదానికి నెలకు 66 లక్షలు చెల్లిస్తున్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: