సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా సినిమాలలో నటిస్తూనే కొన్ని బిజినెస్ లలో కూడా తన డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈయన ఇప్పటికే ఏషియన్ సంస్థతో కలిసి దియేటర్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితమే ఈయన "ఏ ఎం బి" అనే పేరుతో ఏషియన్ సంస్థతో కలిసి ఓ థియేటర్ ను నిర్మించాడు. ఇకపోతే ఈ థియేటర్ ను నిర్మించిన తర్వాత హైదరాబాదు లోని చాలా మంది జనాలు ఈ థియేటర్ లో సినిమాలను చూడడానికి చాలా ఆసక్తిని చూపించారు.

అందులో భాగంగా ఈ థియేటర్ లో కూడా చాలా సౌకర్యాలు ఉండడంతో చాలా తక్కువ కాలం లోనే ఈ థియేటర్ హైదరాబాద్ నగర వాసులకు ఫేవరెట్ అయిపోయింది. దానితో ఏ సినిమా వచ్చినా కూడా ఈ థియేటర్ హౌస్ ఫుల్ అవుతూ ఉంది. దానితో ఈ థియేటర్ ఫుల్ సక్సెస్ అయ్యింది. ఇలా "ఏ ఎం బి" థియేటర్ అద్భుతమైన రీతిలో సక్సెస్ కావడంతో మరోసారి మహేష్ ... ఏషియన్ సంస్థలు కలిపి మరో థియేటర్ ను నిర్మించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే హైదరాబాదు.లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సూపర్ క్రేజ్ కలిగిన థియేటర్ లలో సుదర్శన్ థియేటర్ ఒకటి.

థియేటర్ స్థానంలో మహేష్ ... ఏషియన్ సంస్థలు కలిపి "ఏ ఎం బి క్లాసిక్" అనే పేరుతో ఓ 7 స్క్రీన్ మల్టీ ప్లెక్స్ థియేటర్ ను నిర్మించాలి అని డిసైడ్ అయినట్లు అందులో భాగంగా ఈ థియేటర్ కు సంబంధించిన వర్క్ ను కూడా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మహేష్ ... ఏషియన్ సంస్థలు కలిసి మరో మల్టీ ప్లెక్స్ థియేటర్ ను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

mb