తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండెల్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. 

మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ బృందం ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ హక్కులను మాత్రం అమ్మి వేశారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇక అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను ప్రత్యంగిరా సినిమాస్ ... ఏ ఏ క్రియేషన్స్ సంస్థల వారు సంయుక్తంగా దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఈ రెండు సంస్థలు తాజాగా అధికారికంగా ప్రకటించాయి. ఇకపోతే ఈ రెండు సంస్థలు ఈ సినిమాని ఓవర్ సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలను ఇప్పటి నుండే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య కొంత కాలం క్రితం "దూత" అనే వెబ్ సిరీస్ లో ప్రేక్షకులను పలకరించాడు. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nc