బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ తాజాగా బూట్ కట్ బాలరాజు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . మేఘలేఖ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాలో సునీల్ , ముక్కు అవినాష్ , సిరి హనుమంత్ , ఇంద్రజ వంటి తది తరులు కీలక పాత్రలలో నటించారు . శ్రీనివాస్ కోనేటి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాకు సోహెల్ స్వయంగా నిర్మాత గా మారి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు . ఈ సినిమా ఫిబ్రవరి రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన తర్వాత కూడా ప్రేక్షకుల నుండి భారీ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చు కోలేదు. 

దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను వసూలు చేయడం లో విఫలం అయింది . ఇక పోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమాను ఈ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది చూసే ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: