రష్మిక మందన్న.. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇక ఊపిరి సలపనంతగా షూటింగ్ లతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక వరుసగా సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుంటుంది అని చెప్పాలి. టాలీవుడ్లో చలో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి మొదటి సినిమాతోనే హిట్టు కొట్టింది అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో నటించిన గీతా గోవింద సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేసింది.


 అటు వెంటనే టాప్ హీరో మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ దక్కించుకుని మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఇంకేముంది ఇక ఈ అమ్మడి కెరీర్ కు తిరుగులేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా ఉంది. అయితే ఇటీవల యానిమల్ అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అన్న విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ మూవీ.. బ్లాక్ బస్టర్ అయ్యి దాదాపు 750 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.


 అయితే ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. కానీ తాను మాత్రం యానిమల్ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయాను అంటూ చెబుతుంది రష్మిక మందన్న. కొన్ని క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్న కారణంగా యానిమల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాను అంటూ కామెంట్ చేసింది. యానిమల్ రిలీజ్ అయిన మరుసటి రోజు వేరే షూటింగ్లో పాల్గొన్నారు  అందుకే సక్సెస్ మీట్లు ఇంటర్వ్యూలలో పాల్గొనలేకపోయాను. కొన్ని ప్రతిష్టాత్మకమైన సినిమాలలో నటిస్తున్నాను. అవి అభిమానులను అలరిస్తాయి. ఇక వారు తన పాత్రను ఎంజాయ్ చేసే క్షణాల కోసం ఎదురుచూస్తున్న అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: