టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ఆలస్యం కావడానికి అనిరుధ్ ముఖ్య కారణమని సమాచారం తెలుస్తోంది. అనిరుధ్ రవి చందర్ సరిగ్గా ట్యూన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని సమాచారం అందుతోంది.అక్టోబర్ నెల 10వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఆయుధపూజ సాంగ్ హైలెట్ గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. మాస్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసేలా ఈ పాట ఉంటుందని ఖచ్చితంగా సినిమాకు హైలెట్ అయ్యేలా ఈ సాంగ్ ను షూట్ చేయనున్నారని సమాచారం అందుతోంది.దేవర సినిమాకు అనిరుధ్ రవి చందర్ వేగంగా ట్యూన్స్ ఇస్తే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రీ పోన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనేక కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర సినిమా అప్ డేట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా తన సినీ కెరీర్ లో మరపురాని మూవీగా నిలుస్తుందని ఆమె కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.


ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ గాయం నుంచి కోలుకున్నారని త్వరలో ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఇక రీసెంట్ గా హైదరాబాద్ లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ తో షూటింగ్ లో పాల్గొన్నాడట. రెండు వారాల గ్యాప్ లో ఓజీ, దేవర సినిమాలు రిలీజ్ కానుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.మరి ఇందులో ఈ గ్యాప్ ఏ సినిమాకు ప్లస్ అవుతుందో చూడాలి. పవన్, ఎన్టీఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఇది ఫస్ట్ టైం కాదు.అయితే ఓజీ, దేవర సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కాగా ఈ సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి. ఈసారి దసరా పండుగ అభిమానులకు మరింత స్పెషల్ గా ఉండబోతుందని అనేక కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక పవన్, ఎన్టీఆర్ తమ సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: