దర్శకుడు మెహర్ రమేష్ రీసెంట్ గా భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో దాంతో మెహర్ రమేష్ పై ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మెహర్ రమేష్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్. ఆయన పై నెగిటివ్ కామెంట్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు.  

మెహర్ రమేష్ ముందుగా కన్నడ సినిమాతో దర్శకుడిగా మారారు. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. . ఆ వెంటనే మరోసారి పునీత్ రాజ్ కుమార్ తో కలిసి అజయ్ అనే సినిమా చేశారు. ఈ సినిమా మహేష్ బాబు ఒక్కడు సినిమాకు రీమేక్. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతర్వాత తెలుగులో సినిమాలు చేశారు మెహర్ రమేష్. ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు ఈయన. ఈయనంటే ఈ నలుగురు స్టార్లకు భయమట. ఆల్రెడీ తారక్, ప్రభాస్ లకు కోలుకోని 

షాక్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. బిల్లా సినిమా కాస్త బెటర్ అనుకోవచ్చు. కానీ ఎన్టీఆర్ కు శక్తి సినిమాతో మరీ దారుణమైన ఫలితాలను అందించింది. ఇక బన్నీ చరణ్ లతో సినిమా చేయాలని చాలా సార్లు ట్రై చేశారట దర్శకుడు మెహర్ రమేష్  . కానీ వాళ్లు సైలెంట్ గా ఎస్కేప్ అయ్యారని టాక్. ఇప్పటికీ కూడా వీళ్ల డేట్స్ కోసం ట్రై చేస్తున్నారట. కానీ చరణ్-బన్నీ-ప్రభాస్ లు మాత్రం దర్శకుడు మెహర్ రమేష్  తో సినిమా చేయమంటూ తెగేసి చెబుతున్నారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: