ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీనే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి మ్యూజిక్ ఇచ్చారు. క్రేజీ కాంబోలో రూపొందిన 'ఆదిపురుష్' మూవీని రామాయణంలోని అరణ్య కాండ, యుద్ధ కాండలతో తెరకెక్కించినట్లు ముందుగానే తెలిసింది. అయితే, ఇందులో ట్రీట్‌మెంట్ మాత్రం కొత్తగా ఉండబోతుందని 

ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక, దీని నుంచి టీజర్, పాటలు, ట్రైలర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన విజువల్ వండర్  మూవీ వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అయింది. వివరాల్లోకి వెళితే.. ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమా మార్చి 1 న రిలీజ్ కాబోతుంది. ఇందులో హీరోయిన్ గా నటించిన రాశీ సింగ్ ‘ఆదిపురుష్’ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ..”పెద్ద హీరో, పెద్ద బడ్జెట్.. పెద్ద స్టాప్ ఉన్నప్పటికీ ‘ఆదిపురుష్’ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఘోరంగా అనిపించాయి. చిన్న సినిమాల్లో కూడా అంత ఘోరమైన గ్రాఫిక్స్ వర్క్ నేను చూడలేదు. 

అయితే మా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ క్వాలిటీగా అనిపిస్తాయి. నిర్మాతలు వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. పెద్ద సినిమాకి ఎలా బడ్జెట్ పెడతారో.. ఈ సినిమాకి కూడా అలాగే బడ్జెట్ పెట్టారు” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈమె చేతిలో ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయట. సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా చేస్తుందట. ఏప్రిల్ లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: