సౌత్ లో గత దశాబ్ద కాలంలో యువతని తన గ్లామర్ తో తమన్నా అలరించినంతగా మరే హీరోయిన్ అలరించలేదు అంటే అతిశయోక్తి కాదు. మిల్కీ బ్యూటీగా తమన్నా అందాలకు యువతలో ఉండే క్రేజ్ వేరు. తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సిల్వర్ స్క్రీన్ పై తమన్నా ఎంతలా అందాలు ఒకలబోసినప్పటికీ లిప్ లాక్ కిస్సులకు మాత్రం ఈ బ్యూటీ దూరం.

 చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని తమన్నా తేల్చేసింది. సినిమా గ్లామర్ ఫీల్డ్ అయినప్పటికీ తనకంటూ కొన్ని హద్దులు పెట్టుకున్నానని తమన్నా పేర్కొంది.  ఇకపోతే రాజమౌళి డైరెక్షన్లో రూపుదిద్దుకున్న బహుబలి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ..టాలీవుడ్ సినిమా స్థాయిని ఆమాంతం పెంచేసింది. ఇందులో అవంతికగా నటించిన తమన్నా ఓ కార్యక్రమంలో 'బాహుబలి'ని గుర్తుచేసుకున్నారు. రాజమౌళికి సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పారు. 'బాహుబలి నటీనటులకే కాదు.


.దేశ సినిమా చరిత్రకే కీలక మలపని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం తర్వాత ప్రపంచమంతా భారతీయ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకుందని తెలిపింది. ఇంత గొప్ప చిత్రంలో రాజమౌళి నాకు అవంతిక పాత్రను ఇచ్చారు. దీంతో నటిగా నిరూపించుకోవడానికి నాకు అవకాశం లభించిందని వ్యాఖ్యానించింది. తననే ఎంపిక చేయడానికి కారణమేమిటని రాజమౌళిని ఎన్నోసార్లు అడిగానని ఈ మిల్కీ బ్యూటీ వెల్లడించింది. ఆయన ఎప్పుడూ సమాధానం చెప్పలేదని..ఆ ప్రశ్న అడిగిన ప్రతిసారీ నవ్వుతూ వెళ్లేవారని పేర్కొంది. అది అలా ఉంటే తమన్నా గత కొన్నాళ్లు ఓ వ్యక్తిని ప్రేమిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎప్పుడూ ఈ విషయాన్ని ఒప్పుకోలేదు.  తమన్నా  గత కొన్నాళ్లుగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించగా.. అవి నిజమేనని తెలిపింది ఈ అమ్మడు. తమన్నా తోటి నటుడు విజయ్ వర్మ ను ప్రేమిస్తున్నట్లు.. అతను అంటే ఎంతో ఇష్టమని.. పేర్కోంది. అంతేకాదు ఈ జంట అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: