డైరెక్టర్ నాగ్ అశ్విన్ 'కల్కి2898AD' సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 22 భాషల్లో విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ వైరల్ గా మారింది₹ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ సోషల్ మీడియా అంతటా ఈ వార్త ట్రెండ్ అవుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే అత్యధిక భాషల్లో రిలీజ్ కాబోతున్న బిగ్గెస్ట్ ఎవర్ ఇండియన్ ఫిల్మ్ గా 'కల్కి2898AD' సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి మూవీ టీం త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

'కల్కి2898AD' నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా 'కల్కి' టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. 'కల్కి' టీజర్ సుమారు 1 నిమిషం 23 సెకన్ల నిడివితో ఉండబోతుందట. ఈ టీజర్ ని హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి మూడో వారంలో టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే టీజర్ రిలీజ్ ని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఉన్న హైప్ పీక్స్ కి చేరడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సీనియర్ నిర్మాత అశ్విని దత్ 'కల్కి2898AD' సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే, దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ మరో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: